బావిలోకి దూసుకెళ్లిన జీపు.. ఒకరి మృతి.. ఇద్దరి కోసం గాలింపు

By udayam on October 28th / 8:10 am IST

వరంగల్: వరంగల్‌ జిల్లా సంగెం మండలం గవి చర్ల శివారులో ఓ జీపు అదుపు తప్పి బావిలో పడింది. ప్రమాదం జరిగిన సమయంలో జీపులో 14 మంది ప్ర‌యాణికులు ఉండగా వీరిలో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో నలుగురు బావిలో పడిపోయారు.

వరంగల్‌ నుంచి నెక్కొండ వెళ్తుండగా ఓ జీపు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు.

జిల్లాలో జరిగిన జీపు ప్రమాద ఘటనలో మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రంతా పోలీసులు బావిలో నుంచి నీటిని తోడిస్తున్నారు.

పక్కనే చెరువు ఉండటంతో నీటి ఊటతో ఇబ్బంది తలెత్తుతోంది. అయినప్పటికీ అతికష్టం మీద జీపును బయటకు తీశారు. డ్రైవర్ సతీష్ మృతదేహం లభ్యమవగా మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.