తరుణ్​ భాస్కర్​ దర్శకత్వంలో మాస్టారుగా వెంకటేష్​

By udayam on October 28th / 9:20 am IST

మహిళా ప్రేక్షకుల ఆదరణ తో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా అలరించే విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మాస్టారుగా కనిపించబోతున్నాడు. పెళ్లిచూపులు’ చిత్రంతో  సత్తా చాటిన  దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాన్ని తీశాడు. మూడో సినిమాకే వెంకటేశ్‌ని డైరెక్ట్‌ చేసే ఛాన్స్ కొట్టేసాడు.

ప్రస్తుతం వెంకటేశ్‌ ‘నారప్ప’, ‘ఎఫ్‌ 3’ సినిమాలు కమిట్‌ అవ్వడంతో ఆ రెండూ పూర్తయ్యాక ఈ కొత్త మూవీ ఉంటుందట. గుర్రపు పందేల బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో వెంకటేశ్‌ లెక్చరర్‌ పాత్ర చేస్తాడని టాక్.

వెంకీ లెక్చరర్‌గా కనిపించే పోర్షన్‌ మొత్తం వినోదాత్మకంగా ఉంటుందట. సురేశ్ ‌బాబు నిర్మించనున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో సెట్స్ మీదికి వస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్ధిన్‌ సిద్ధిఖీని తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్రయత్నాల్లో ఉందట.