గర్వంగా ఉంది నాన్న : ఆశ్రిత

By udayam on July 21st / 9:40 am IST

విక్టరీ వెంకటేష్​ తాజా చిత్రం ‘నారప్ప’ సినిమాపై ఆయన కూతురు ఆశ్రిత ఇన్​స్టాలో ఉద్వేగంతో పోస్ట్​ చేశారు. ‘మొదటి రోజు మొదటి షోను మీతో ధియేటర్లలో చూసే రోజులు మిస్​ అవుతున్నా. మీకు దూరంగా ఉన్నప్పటికీ నాకు ఆ ఛాన్స్​ ఇప్పటికీ దొరుకుతోంది. నారప్పలో మీ నటనతో మిమ్మల్ని మీరే దాటేశారు. కుటుంబం కోసం ఎంతదూరమైనా వెళ్ళే మీ లక్షణమే మీకీ సినిమా తీసుకొచ్చింది. మీ స్వచ్ఛమైన మనసు సినిమాలోనూ కనిపించింది’ అంటూ ఆశ్రిత ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు.

ట్యాగ్స్​