కాంగ్రెస్ సీనియర్ నేత పండిట్ సుఖ్ రామ్ ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. ఎయిమ్స్‌లో చికిత్స తీసుకొంటున్న ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి చెందిన ఆయన 2017లో కాంగ్రెస్‌ను వీడి తిరిగి 2019లో అదే పార్టీలో చేరారు. 1993–1996 మధ్య ఆయన దేశానికి కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. ఐదుసార్లు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేగానూ, 3 సార్లు ఎంపిగానూ గెలిచారు.