ప్రముఖ మలయాళ నేపథ్య గాయకుడు ఎడవ బషీర్ ఓ సంగీత విభావరిలో గానమాలపిస్తూ కుప్పకూలారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతోనే ఆయన మృతికి కారణమని వైద్యులు తేల్చారు. ఈనెల 28న అలప్పుజాలో జరిగిన బ్లూ డైమండ్ ఆర్కెస్ట్రా స్వర్ణోత్సవ వేడుకల్లో యేసుదాసు గీతం మానో హో తుమ్ పాట పాడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. రఘు వంశం సినిమాతో తొలిసారిగా సినిమాలకు పాట పాడిన ఆయన పలు దేశాల్లో జరిగిన కన్సర్ట్లలోనూ ఆయన ప్రదర్శనలిచ్చారు.