కైకాల సినీ ప్రస్థానం ఇలా..

By udayam on December 23rd / 7:02 am IST

తెలుగు సినిమా సీనియర్​ నటుడు కైకాల సత్యనారాయణ ఈ ఉదయం హఠాత్మరణం చెందడం యావత్​ సినీ లోకాన్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 1935 జులైలో 25న కృష్ణ జిల్లా కౌతారం గ్రామంలో జన్మించిన ఆయన 1959లో తెరకెక్కిన సిపాయి కూతురు సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. 60 ఏళ్ళకు పైగా సాగిన ఆయన సినీ జీవితంలో 777 సినిమాల్లో నటించారు. సీనియర్​ ఎన్టీఆర్​ తో ఆయన 101 సినిమాల్లో విలన్​ గా, స్నేహితుడిగా, పోలీస్​ అధికారిగా నటించారు. ఇటు మెగాస్టార్​ చిరంజీవితోనూ 20 కు పైగా సినిమాల్లో ఆయన కలిసి నటించారు. కెరీర్ తొలి దశలో ఎక్కువగా విలన్ పాత్రలు చేశారు. తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు.రావణాసురుడు, యమధర్మరాజు, దుర్యోధనుడు వంటి పాత్రలలో ఆయనకు సాటిలేరన్న ప్రశంసలు అందుకున్నారు.

ట్యాగ్స్​