నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ వెల్లడించారు. కైకాల సత్యనారాయణ మూడు తరాలకు గుర్తుండే గొప్ప నటుడని కొనియాడారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనదైన శైలిలో అలరించారని చెప్పారు. 777 సినిమాల్లో నటించడం గర్వించదగ్గ విషయమన్నారు. అటు పాలిటిక్స్ లోను తనదైన ముద్ర వేశారన్నారు.