బెంగళూరులోని ఓ స్కూల్ ఆవరణలో విద్యార్థినులు జుట్టు పట్టుకుని రోడ్డుపై పడి మరీ కొట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. వీరంతా 6–9 తరగతులు చదువుతున్న వారేనని కామెంట్లు వస్తున్నాయి. చేతిలో హాకీ స్టిక్స్ పట్టుకుని మరీ డజన్ల కొద్దీ అమ్మాయిలు ఇలా రోడ్డు పై కొట్టుకుంటున్న వీడియోను ఇప్పటి వరకూ 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ గొడవ ఎప్పుడు, ఎందుకు జరిగిందన్నది ఇంకా తెలియలేదు. బెంగళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ ఆవరణలో ఈ గొడవ జరిగిందని నిర్ధారణ అయింది.
Y'all need to even if y'all haven't already 😭😭😭 pic.twitter.com/fBbJv9CXoc
— T.sh (@Taha_shah0) May 17, 2022