వైభవంగా నయన్​–విఘ్నేశ్​ల వివాహం

By udayam on June 9th / 7:31 am IST

కోలీవుడ్​ ప్రేమజంట నయనతార–విఘ్నేశ్​ శివన్​ల వివాహం అంగరంగ వైభవంగా గురువారం తెల్లవారుఝామున జరిగింది. ఉదయం 2.22 గంటలకు మహాబలిపురంలోని ఓ రిసార్ట్​లో వీరిద్దరూ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. సూపర్​ స్టార్​ రజనీకాంత్​, బాలీవుడ్​ బాద్​ షా షారూక్​ ఖాన్​లు ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్ళికి సంబంధించిన ఫొటోలు ఆన్​లైన్​లో వైరల్​ అవుతున్నాయి. డైరెక్టర్​ అట్లీ, షారూక్​ ఖాన్​ల ఫొటో కూడా వైరల్​ అవుతోంది.

ట్యాగ్స్​