27 నుంచి హాట్​స్టార్​లోకి కెఆర్​కె

By udayam on May 19th / 7:14 am IST

విజయ్​ సేతుపతి, సమంత, నయన తారల కాంబోలో తెరకెక్కిన విఘ్నేష్​ శివన్​ మూవీ ‘కాథువాకుల రెండు కాదల్​’ మూవీ ఓటిటి రిలీజ్​ డేట్​ లాక్​ అయింది. ఈనెల 27 నుంచి డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో ఈ మూవీ స్ట్రీమింగ్​ కానుంది. రౌడీ పిక్చర్స్​, సెవెన్​ స్క్రీన్​ స్టూడియోస్​ బ్యానర్​పై విఘ్నేశ్​, నయనతార, లలిత్​ కుమార్​లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. గత నెల 28న రిలీజైన ఈ మూవీ తెలుగులో ఫ్లాప్​ టాక్​ తెచ్చుకున్నప్పటికీ తమిళంలో బాగానే కలెక్షన్లు సాధించింది.