లోకేష్ కనగరాజ్, విజయ్, త్రిషల కాంబోలో తెరకెక్కుతున్న #Thalapathy67 షూటింగ్ ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి విజయ్ 30 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఈరోజే ఈ మూవీకి శ్రీకారం చుట్టారు. త్వరలోనే అఫీషియల్ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. లోకేష్ కనగరాజ్ యూనివర్శ్ లో భాగంగా పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే విజయ్ తన వారిసు మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే.