సమంత, విజయ్​లకు యాక్సిడెంట్​.. ఆ వార్తల్లో నిజం లేదు

By udayam on May 24th / 5:32 am IST

ఖుషి మూవీ సెట్స్​లో హీరో విజయ దేవరకొండ, హీరోయిన్​ సమంతలకు పెద్ద యాక్సిడెంట్​ అయిందంటూ సోషల్​ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చిత్ర యూనిట్​ ఖండించింది. అసలు అలాంటి ప్రమాదమేమీ జరగలేదని వివరణ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్​లో ఈ మూవీ తొలి షెడ్యూల్​ను 30 రోజుల పాటు షూట్​ చేసి నిన్ననే హైదరాబాద్​ చేరుకున్నట్లు తెలిపింది. అంతకు ముందు సమంత, విజయ్​లు డ్రైవ్​ చేస్తున్న కారు కాల్వలోకి దూసుకుపోవడంతో వీరికి గాయాలయ్యాయన్న ప్రచారం జోరుగా సాగింది.

ట్యాగ్స్​