#Deverasanta2022 : మనాలి ట్రిప్​ కు 100 మందిని పంపిస్తున్న విజయ్​

By udayam on January 9th / 5:12 am IST

ప్రతీ ఏటా క్రిస్మస్​ కు తన ఫ్యాన్స్​ కు గిఫ్ట్స్​ ఇచ్చే టాలీవుడ్​ అర్జున్​ రెడ్డి.. విజయ్​ దేవరకొండ.. ఈ ఏడాది 100 మంది తన అభిమానులను మనాలి ట్రిప్​ కు పంపిస్తున్నట్లు తాజాగా ప్రకటించాడు. ఇందుకోసం ఓ ట్విట్టర్​ పోల్​ ను నిర్వహించిన విజయ్​ అందులో మౌంటేన్స్​ ఆఫ్​ ఇండియా, బీచెస్​ ఆఫ్​ ఇండియా, కల్చర్​ ట్రిప్​ ఆఫ్​ ఇండియా, డిజర్ట్స్​ ఇన్​ ఇండియా లలో దేనీకి మీరు ఓటేస్తారు? అంటూ ప్రశ్నించాడు. ఇందులో ఎక్కువ మంది పర్వతాలకు వెళ్తామని ప్రకటించడంతో విజయ్​ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ బహుమతిలో మరో ట్విస్ట్​ ఏంటంటో వీళ్ళతో పాటు మన హీరో కూడా ఈ ట్రిప్​ మధ్యలో జాయిన్​ కానున్నాడు.

ట్యాగ్స్​