మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మి

By udayam on February 22nd / 3:02 pm IST

హైద్రాబాద్: జీహెచ్‌ఎంసీ మేయర్‌గా గద్వాల‌ విజయలక్ష్మి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని, కె.కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా గెలుపొందిన విజయలక్ష్మిని జీహెచ్‌ఎంసీ మేయర్‌గా, శ్రీలతని డిప్యూటీ మేయర్‌గా ఈ నెల 11న ఎన్నుకున్న నేపథ్యంలో ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు.