ఈరోజే రిలీజైన రెండు పాన్ ఇండియా మూవీస్ విక్రమ్, మేజర్లు అప్పుడే లీకుల బారిన పడ్డాయి. ఈ రెండు సినిమాల హెచ్డి ప్రింట్లు టొరంట్ సైట్లలో ప్లే అవుతున్నాయి. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్, అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మేజర్ సినిమాలు శుక్రవారం రిలీజ్ అయిన 3 గంటల్లోనే లీక్ కావడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెనిఫిట్ షోస్ పూర్తయిన వెంటనే ఈ హెచ్డి ప్రింట్ల లీక్‌లు జరిగాయని ఆరోపిస్తున్నారు.