అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. తన మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ను శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించింది. ఈ ఉదయం 11.30 గంటలకు విక్రమ్–ఎస్ పేరుతో సిద్ధమైన ఈ రాకెట్ నిప్పులు కక్కుతూ అంతరిక్ష ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ రాకెట్ ప్రయోగంతో భారత అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు కంపెనీలు లాంఛనంగా అడుగుపెట్టినట్లు అయింది. హైదరాబాద్ కు చెందిన స్కై రూట్ ఏరో స్పేస్ సంస్థ ఈ రాకెట్ ను అభివృద్ధి చేసింది.
భారత అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త చరిత్ర.. తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్–ఎస్ ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో#VikramS #ISRO pic.twitter.com/rJwxEfptG4
— Udayam News Telugu (@udayam_official) November 18, 2022