దేశ రాజధాని ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు. 2016 నుంచి ఈ పదవిలో ఉన్న అనిల్ బైజల్ వ్యక్తిగత కారణాలతో తన ఎల్జీ పదవికి రాజీనామా చేయడంతో అతడి స్థానాన్ని సక్సేనాతో భర్తీ చేస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది. సక్సేనా నియామకాన్ని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు.