హార్ధిక్ సేనకు ముంబై బ్రేకులు వేసింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో.. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి రాగా కేవలం 3 పరుగులే ఇచ్చిన శామ్స్ ముంబైకు ఘన విజయాన్ని అందించాడు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబైకు ఇషాన్ 45, రోహిత్ 43, టిమ్ డేవిడ్ 44 పరుగులు చేయడంతో 177 పరుగులు చేసింది. ఛేధనను ధాటిగా ఆరంభించిన గుజరాత్ కు సాహా 55, గిల్ 52 పరుగులు చేశారు. హార్ధిక్ 24, మిల్లర్ 19 పరుగులు చేసిన చివరి ఓవర్లో తడబడింది ఆ జట్టు.