ఎల్​ చాపో కొడుకు అరెస్ట్​.. మెక్సికోలో అల్లకల్లోలంగా మారిన నిరసనలు

By udayam on January 6th / 1:11 pm IST

అంతర్జాతీయంగా పేరుమోసిన డ్రగ్స్ వ్యాపారి ఎల్ చాపో కుమారుడు ఒవిడియో గుజ్మన్ లోపెజ్‌ను క్యులియకాన్‌లో అరెస్ట్ చేయడంతో ఆ దేశంలో తీవ్ర అల్లర్లు చెలరేగాయి. ఎల్​ చాపో గ్రూపులో పనిచేసే వారు మెక్సికో నగరంలో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు రోడ్లపై పార్క్​ చేసిన వాహనాలకు నిప్పు పెట్టారు. అంతటితో శాంతించని నిరసనకారులు మెక్సికో విమానాశ్రయంలో రెండు విమానాలపై తుపాకుల వర్షం కురిపించారు. దీంతో ఈ విమానాశ్రయం బయల్దేరాల్సిన విమానాలన్నీ రద్దయ్యాయి. అల్లర్లలో గాయపడిన 18 మందిని ఆసుపత్రికి తరలించినట్లు సినలోవా గవర్నర్ తెలిపారు.

ట్యాగ్స్​