చైనా : అతి పెద్ద ఐఫోన్​ ఫ్యాక్టరీలో కార్మికుల నిరసనలు

By udayam on November 23rd / 9:40 am IST

చైనాలో ఉన్న ప్రపంచంలోని అతి పెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ ఫాక్స్‌కాన్‌లో కార్మికులు భారీ నిరసనలకు దిగారు. వందల మంది కార్మికులు ఫ్యాక్టరీలో మార్చ్​ చేస్తున్న వీడియోలో నెట్టింట వైరల్​ గా మారాయి. వారిని అదుపు చేసేందుకు ఫాక్స్​ కాన్​ భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ వారంతా ‘మా హక్కులను రక్షించుకుంటాం’ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. కొందరు సీసీ కెమెరాలు, కిటికీలను ధ్వంసం చేశారు. తమకు పెట్టే తిండి సరిగ్గా లేదని అలాగే హామీ ఇచ్చినట్లుగా బోనస్ చెల్లించడం లేదని కూడా వారు నిరసన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​