తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు

By udayam on January 13th / 5:36 am IST

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో బుధవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. శాస్త్రోక్తంగా ధనుర్మాస పూజలు నిర్వహించిన పండితులు రాత్రి 1.45 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. సుప్రీంకోర్ట్​ చీఫ్​ జస్టిస్​ ఎన్వీ రమణ విఐపీ బ్రేక్​ లో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రులు నారాయణ స్వామి, మేకపాటి గౌతమ్​రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్​, బాలినేని శ్రీనివాస్​ రెడ్డిలు పాల్గొన్నారు.

ట్యాగ్స్​