కోహ్లీకి అమ్మాయి పుట్టిందోచ్​

తల్లీ, కూతుర్లు క్షేమంగా ఉన్నారంటూ కోహ్లీ పోస్ట్​

By udayam on January 11th / 10:56 am IST

భారత క్రికెట్​ జట్టు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, అనుష్క దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ మేరకు విరాట్​ కోహ్లీ కొద్దిసేపటి క్రితం తన ఇన్​స్టా గ్రామ్​ అకౌంట్లో పోస్ట్​ చేశాడు.

‘‘ఈరోజు మధ్యాహ్నం మాకు అమ్మాయి పుట్టిందన్న విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ప్రార్ధనలకు కృతజ్ఞతలు. చిన్నారి, అనుష్క శర్మ ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నాం. ఈ సమయంలో మా ప్రైవసీకి ఎలాంటి భంగం కలిగించరని ఆశిస్తున్నాం” అంటూ కోహ్లీ ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడు.

తన భార్య అనుష్క శర్మ ఏ సమయంలోనైనా బిడ్డకు జన్మనివ్వవచ్చనే ఆస్ట్రేలియా పర్యటనను అర్ధాంతంగా వదిలి విరాట్​ కోహ్లీ భారత్​ చేరుకున్న విషయం తెలిసిందే.