క్రీజులో ఉన్నది కొద్ది సేపే అయినా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన క్రీడా స్ఫూర్తిని చాటాడు. ట్రెంట్ బోల్ట్ బౌలింగ్‌లో అతడు ఆడిన షాట్‌ను అడ్డుకుని బట్లర్ వేసిన త్రో.. కోహ్లీ కాలికి తగిలి బాల్ బౌండరీ వద్దకు వెళ్ళినా అతడు పరుగు తీయకుండా ఉండిపోయాడు. ఇది చూసిన కోహ్లీ ఫ్యాన్స్ అతడి క్రీడా స్ఫూర్తికి ఫిదా అయ్యారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 7 పరుగులు మాత్రమే చేసి ప్రసిద్ధ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.