భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన వన్డే జెర్సీ ని బంగ్లా యువ ఆల్ రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్ కు బహుమతిగా అందించాడు. ఆదివారం ముగిసిన రెండో టెస్ట్ అనంతరం కోహ్లీ తన జెర్సీని మెహదీకి అందించాడు. రెండో టెస్ట్ లో భారత్ 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా 7 వికెట్లు కోల్పోయి నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మెహదీ హసన్ 5 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో కోహ్లీ తన జెర్సీని అతడికి బహుమతిగా అందించి ప్రోత్సహించాడు.
Special souvenir from one of the greatest cricketer Virat Kohli. 🤝 pic.twitter.com/y67twA2Rle
— Mehidy Hasan Miraz (@Officialmiraz) December 25, 2022