టెస్టులకు కెప్టెన్సీ పదవి నుంచి విరాట్ కోహ్లీ దిగిపోతేనే అది అతడి బ్యాటింగ్ కెరీర్‌కు దోహదపడగలదని భారత స్పిన్ లెజెండ్ బిషన్ సింగ్ బేడీ వ్యాఖ్యానించారు.
కెప్టెన్సీ బాధ్యతలను అజింక్యా రహానేకు అప్పగించి అతడు పూర్తిగా బ్యాటింగ్ పైనే దృష్టి పెడితే మంచిదని బేడీ సలహా ఇచ్చాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ కెప్టెన్సీలో వెనుకబడ్డ టీం ఇండియాను రహానే 2–1తో గెలుచుకు వచ్చాడని దీన్ని బట్టి అతడి సామర్థ్యం ఏంటో అర్ధమవుతోందని పేర్కొన్నాడు.
‘‘భారత్‌కు విరాట్ మరింత కాలం సేవలందించాలంటే అతడు బ్యాటింగ్‌పైనే దృష్టిపెట్టాలి. కెప్టెన్సీపై కాదు. అది అజింక్యా చక్కగా నిర్వహించగలడు” అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన కాలమ్‌లో బేడీ అభిప్రాయపడ్డాడు.