సాయి పల్లవి, దగ్గుబాటి రాణా జంటగా నటించిన చిత్రం ‘విరాట పర్వం’ కొత్త రిలీజ్ డేట్ లాక్ చేసింది. ముందుగా ప్రకటించినట్లు జులై 1న కాకుండా అంతకు ముందే జూన్ 17న ఈ మూవీని ధియేటర్లలో లాంచ్ చేస్తున్నట్లు సాయి పల్లవి ట్వీట్ చేసింది. రిలీజ్ డేట్‌తో పాటు సరికొత్త టీజర్‌ను సైతం మేకర్స్ షేర్ చేశారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ నిర్మిస్తోంది. ఇప్పటికే పాలుమార్లు వాయిదా పడ్డ ఈ మూవీ కమ్యూనిస్ట్‌ల కథతో తెరకెక్కింది.
We’ll see you sooner 🙈 #VirataParvam from the “17th of June” ♥️@RanaDaggubati @venuudugulafilm @SLVCinemasOffl pic.twitter.com/7byqVrw1hq
— Sai Pallavi (@Sai_Pallavi92) May 30, 2022