అమెరికా: వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు.. 14 మంది మృతి

By udayam on November 23rd / 8:56 am IST

అమెరికా వర్జీనియా రాష్ట్రం ఈరోజు గన్​ కాల్పులతో వణికిపోయింది. చీనాపీక్​ లోని వాల్​ మార్ట్​ స్టోర్​ లో పనిచేస్తున్న మేనేజర్​ తన తోటి ఉద్యోగులపై కనికరం లేకుండా కాల్పులు జరిపి 14 మందిని పొట్టనపెట్టుకున్నాడు. స్టోర్​ లో ఉన్న పదుల సంఖ్యలో వినియోగదారులకు సైతం ఈ ఘటనలో గాయపడ్డారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. వాల్‌మార్ట్‌ స్టోర్‌ దగ్గరకు భారీ సంఖ్యలో అంబులెన్సులు, పోలీసులు చేరుకున్నారు.మృతులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చీస్ పిక్ పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​