సిఎంఓ నుంచి మాట్లాడుతున్నానంటూ దేశంలోని పలువురు ఎమ్మెల్యేలను మోసం చేసిన విశాఖపట్టణానికి చెందిన పి.విష్ణుమూర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా వసూలు చేసిన రూ.80 లక్షలతో తన గర్ల్ ఫ్రెండ్‌కు ఖరీదైన ఫ్లాట్ కూడా కొనిచ్చాడని తెలుసుకుని పోలీసులు ఖంగుతిన్నారు. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా సందీప్ ఇలా డబ్బులు డిమాండ్ చేశాడు. దీనిపై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ఎపిలోని గాజువాక నుంచి విపిఎన్ ద్వారా ఫోన్లు చేస్తున్నాడని తేల్చారు.