హీరో విశాల్​ : కుప్పంలో పోటీ చేయట్లేదు

By udayam on July 2nd / 4:47 am IST

తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ పేరు తెచ్చుకున్న నటుడు విశాల్​ త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయనున్నాడన్న వార్తలపై తొలిసారిగా స్పందించాడు. 2024లో వచ్చే ఎన్నికల్లో ఎపిలోని కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడని జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరం అని కొట్టి పారేశాడు. ‘రాజకీయ ప్రవేశంపై ఇప్పటి వరకూ ఎవరూ తనను సంప్రదించలేదు. అలాంటప్పుడు ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తారో తెలియదు. నా దృష్టంతా ఇప్పుడు సినిమాల పైనే ఉంది’ అని ట్వీట్​ చేశాడు.

ట్యాగ్స్​