ఫిబ్రవరి 17న ధమ్కీ ఇస్తాడట

By udayam on November 24th / 10:51 am IST

విశ్వక్​ సేన్​ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘దాస్​ కా దమ్కీ’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ మేరకు రిలీజ్​ డేట్​ ను ఈరోజు ప్రకటించారు. విశ్వక్​ సేన్​ సొంతంగానే దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి లియోన్​ జేమ్స్​ సంగీతం అందిస్తున్నాడు. నివేదా పేతురాజ్​ మరోసారి విశ్వక్​ సరసన హీరోయిన్​ గా చేస్తోంది. రావు రమేష్​, రోహిణి, అజయ్​ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్​ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ యాక్షన్ కామెడీ జోనర్లో ఈ మూవీ తెరకెక్కింది.

ట్యాగ్స్​