ఫిబ్రవరిలో విశ్వక్​ ‘దాస్​ కా దమ్కీ’

By udayam on November 17th / 9:06 am IST

మాస్​ కరా దాస్​ విశ్వక్​ సేన్​.. తనకు అచ్చొచ్చిన మాస్​–యాక్షన్​ జోనర్​ లోకి వచ్చేశాడు. తానే సొంతంగా డైరెక్షన్​, నిర్మాతగానూ వ్యవహరిస్తున్న ‘దాస్​ కా దమ్కీ’ మూవీ నుంచి తొలి పోస్టర్​ ను లాంచ్​ చేశాడు. స్టైలిష్​ రౌడీ లుక్​ లో కనిపిస్తున్న విశ్వక్​ సరసన ఈ మూవీలో నివేదా పేతురాజ్​ హీరోయిన్​ గా చేస్తోంది. కరాటే రాజు, విశ్వక్​ సేన్​ సినిమా బ్యానర్లపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో ఈ మూవీని పాన్​ ఇండియా లెవల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు.

ట్యాగ్స్​