స్టిమ్యులేటర్ మీద ట్రైనింగ్ పూర్తి కాకుండానే ఓ కో పైలట్ విస్తారా విమానాన్ని ఇండోర్‌లో ల్యాండ్ చేశాడు. దీంతో ఆ విమాన సంస్థకు డిజిసిఎ రూ.10 లక్షల జరిమానాను విధించింది. ఈ ఘోర తప్పిదానికి పాల్పడ్డ విస్తారా యాజమాన్యం.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడిందని డిజిసిఎ తీవ్రంగా ఆక్షేపించింది. టేకాఫ్, ల్యాండింగ్ క్లియరెన్స్‌ల విషయంలోనూ ఆ కో పైలట్ డిజిసిఎ ప్రమాణాలను అందుకోలేదని పేర్కొంది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్నది మాత్రం డిజిసిఎ బయటపెట్టలేదు.