టాటా సన్స్ కంపెనీకి చెందిన ఎయిరిండియా (ఎఐ)లో సింగపూర్ విమాన కంపెనీ విస్తారా విలీనం కానుంది. విస్తారాను ఎఐలో కలిపేందుకు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఎఐలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ 250 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో ఎఐలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా దక్కనుంది. ఈ విలీనం ప్రక్రియను 2024 మార్చి కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.