ప్రీమియం లుక్​ తో వివో ఎక్స్​ 90 వచ్చేసింది

By udayam on November 23rd / 6:39 am IST

ప్రముఖ చైనీ కంపెనీ వివో అత్యాధునిక, ప్రీమియం డిజైన్ తో కూడిన ఎక్స్90 స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. జీస్ ఆప్టిక్స్ సహా ఎన్నో ప్రత్యేకతలు ఈ ఫోన్లో కనిపిస్తాయి. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర 3,699 యువాన్లుగా ఉంది. మన రూపాయిల్లో సుమారు రూ.42వేలు. ఇక 8జీబీ ర్యామ్, 256జీబీ ర్యామ్ మన రూపాయల ప్రకారం 57వేలుగా ఉంది. వివో ఎక్స్90 ప్రో మోడల్ 12+256జీబీ స్టోరేజీ ధర రూ.74వేలుగా ఉంది.ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పనిచేస్తాయి. పంచ్ హోల్ డిస్ ప్లే, 6.78 ఇంచ్​ అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, మీడియా టెక్ డైమెన్సిటీ 9200 చిప్ సెట్, 4,810 బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. వెనుక భాగంలో 50 ఎంపి సోనీ ఐఎంఎక్స్ 866 కెమెరా సెన్సార్, ముందు భాగంలో 32 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాలుగా ఉంటాయి.

ట్యాగ్స్​