పుతిన్​: చర్చలకు మేమెప్పుడూ సిద్ధమే

By udayam on December 26th / 6:26 am IST

ఉక్రెయిన్‌లో యుద్ధంలో పాల్గొంటున్న అన్ని పక్షాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా ఆధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించాడు. అయితే ఉక్రెయిన్‌, దాని వెనక ఉన్న పశ్చిమ దేశాలు చర్చలను తిరస్కరిస్తున్నాయని పుతిన్‌ తెలిపారు. తమ లక్ష్యాలన్నింటినీ సాధించే వరకూ పోరాటం కొనసాగుతుందని పుతిన్‌ అన్నాడు. ‘యుద్ధంతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరితో ఆమోదయోగ్యమైన పరిష్కారాల కోసం చర్చలు జరపడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అయితే అది వారి ఇష్టం. చర్చలకు నిరాకరిస్తున్నది మేం కాదు…వారే’ అని ఆదివారం టివిలో మాట్లాడుతూ పుతిన్​ చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​