రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌కు త్వరలోనే క్యాన్సర్ సర్జరీ జరగనుందని రష్యా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన తన అధికారాల్ని కొద్ది రోజుల పాటు మాజీ కెజిబి చీఫ్ నికోలయి పట్రుషెవ్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి కర్త, కర్మ క్రియ అయిన 70 ఏళ్ళ నికోలయికి ఉక్రెయిన్ యుద్ధ బాధ్యతల్ని అప్పగించి పుతిన్ దాదాపు 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారని సమాచారం.