అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత టెలికాం మార్కెట్లోకి అడుగులు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా వొడాఫోన్–ఐడియా జాయింట్ వెంచర్లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ వార్త బయటకు రావడంతోనే ఈ వొడా–ఐడియాల మార్కెట్ స్టాక్ ఈరోజు 5 శాతం లాభపడింది. ఈరోజు మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఈ కంపెనీకి చెందిన 223.91 లక్షల షేర్లు చేతులు మారాయి.