ఇండోనేషియా జావా ద్వీపంలోని సెమెరు అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున బద్ధలైంది. 1.5 కిలోమీటర్ల మేర గాలిలోకి బూడిద ఎగిసిపడిందని, ప్రజలు దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. అగ్నిపర్వతం నుండి 5 కిలోమీటర్ల లోపల ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని ఇండోనేషియావిపత్తు ఉపశమన సంస్థ సూచించింది. అగ్నిపర్వతం నుండి వస్తున్న లావాకు 500 మీ దూరంలో ఉండాలని తెలిపింది. సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ ఏజెన్సీ వెల్లడించింది.
🇮🇩The Mount Semeru Volcano erupts in Indonesia.#volcano #volcanoerupts #eruption #Indonesia #news pic.twitter.com/0AuGYkwe0M
— F.M NEWS (@fmnewseng) December 4, 2022