గుజరాత్​: మొదలైన రెండో దశ పోలింగ్​

By udayam on December 5th / 5:08 am IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ సోమవారం ఉదయం మొదలైంది. మొత్తం 14 జిల్లాలకు చెందిన 93 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. 2.5 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.గాంధీనగర్‌లోని రాజ్‌భవన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేయడానికి బయలు దేరారు.ప్రధానితో పాటు ఆ రాష్ట్ర సిఎం భూపేంద్ర పాటెల్​, కేంద్ర హోం మంత్రి అమిత్​ షాలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ట్యాగ్స్​