ఆంధ్రప్రదేశ్లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఫిబ్రవరిలో ఆకస్మికంగా మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. నేడు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 2,13,338 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 131 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తంచి, వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగుతోంది.