వచ్చే నెల 26 నుంచి ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వివిఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో భారత ఎ జట్టు స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్ ఆడనుంది. దీంతో ఐర్లాండ్ పర్యటనకు భారత్ తన బి టీమ్‌ను వివిఎస్ లక్ష్మణ్ కోచ్‌గా పంపనుందని సమాచారం. ద్రవిడ్ బాధ్యతల్ని మోయడానికి ఎన్‌సిఎ హెడ్ లక్ష్మణ్ సైతం సుముఖత వ్యక్తం చేసినట్లు బిసిసిఐ అధికారులు క్రిక్ ట్రాకర్ వెబ్‌సైట్‌కు వెల్లడించారు.