పశువులను రైళ్లు ఢీకొంటున్న ఉదంతాలు ఇటీవల కాలంలో పెరిగిన నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు పట్టాలపైకి పశువులు రాకుండా నిరోధించేందుకు అడ్డు గోడలు కట్టాలని నిర్ణయానికి వచ్చింది.రాబోయే ఐదారు నెలల్లో దేశవ్యాప్తంగా వెయ్యి కిలోమీటర్ల మేర గోడలు కట్టనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.గోడ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఒక డిజైన్‌ను ఖరారు చేశామని, ఇది ఎంతమేర సత్ఫలితాలనిస్తుందో తెలుసుకునేందుకు కొన్ని సెక్షన్లలో నిర్మాణం చేపట్టనున్నట్లు వైష్ణవ్ చెప్పారు.