బాబీ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ వారు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదల తేదీని నిర్మతలు ప్రకటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో శ్రుతి హాసన్, రవితేజ నటిస్తున్నారు.
ఈ సంక్రాంతి యుద్ధానికి రెడీ అంటున్న వీరయ్య : జనవరి 13న రిలీజ్. #WaltairVeerayya pic.twitter.com/evAnhyaOCM
— Udayam News Telugu (@udayam_official) December 7, 2022