వేదిక మార్పు: బాలయ్య తర్వాత చిరంజీవి వంతు

By udayam on January 6th / 5:59 am IST

ఆంధ్రప్రదేశ్​ లో ఈవెంట్లకు, సభలకు కొత్త రూల్స్​ వచ్చిన నేపధ్యంలో సినిమా ఫంక్షన్లకూ వీటితో పెద్ద చిక్కే వచ్చి పడుతోంది. నిన్ననే బాలయ్య మూవీ ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ జరిగే స్థలాన్ని ఒంగోలులోని ఏబీఎం కాలేజ్​ గ్రౌండ్స్​ నుంచి అర్జున్​ ఇన్​ ఫ్రా గ్రౌండ్స్​ కు మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చిరంజీవి మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ కు కూడా వేదిక మార్పు జరిగింది. ఆర్కే బీచ్ లో ఇప్పటికే ఈ ఈవెంట్​ కు పనులు పూర్తి కాగా ఇప్పుడు వీటిని అక్కడ నుంచి తొలగించి ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కు వేదికను మార్చారు.

ట్యాగ్స్​