చిరంజీవి, శృతి హాసన్ ల మాస్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య నుంచి మేకర్స్ మరో క్రేజీ సాంగ్ ను విడుదల చేశారు. ‘‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ..’ అంటూ సాగే లిరికల్ సాంగ్ లో చిరంజీవి తన ముఠామేస్త్రీ గెటప్పులో మరోసారి మెస్మరైజ్ చేశారు. శృతి హాసన్ అందం, డిఎస్పీ మ్యూజిక్ దుమ్మురేపాయి. మీకా సింగ్, గీతా మాధురి, వెల్మురుగన్ లు పాడిన ఈ పాటకు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి రాశారు. రవితేజ, ప్రకాష్ రాజు, రాజేంద్ర ప్రసాద్, బాబీ కొల్లి నటిస్తున్న ఈ మూవీ ఈనెల 13న విడుదల కానుంది.