మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ్ రవితేజ కీలక పాత్రల్లో నటించిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’ నుంచి త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుందని టాక్. జనవరి 13న సంక్రాంతి కి సిద్ధమవుతున్న ఈ మూవీకి బాబీ డైరెక్షన్ చేస్తున్నారు. రీసెంట్గానే సెన్సార్ పూర్తి చేసుకుని, సెన్సార్ బృందం నుండి యూ/ ఏ సెర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ మూవీ ట్రైలర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ విడుదల కానుందని టాక్. అయితే వైజాగ్ లో జరిగే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను లాంచ్ చేస్తారని మరో టాక్ కూడా ఉంది.