ధియేటర్లు బాలయ్యకే ఎక్కువట!

By udayam on December 30th / 10:52 am IST

ఒకరే నిర్మాతలు.. ఇద్దరు బడా స్టార్లు.. వారిద్దరి మూవీస్​ రిలీజ్​ కూడా ఒకేసారి. ఇలాంటి తలనొప్పి ఏ ప్రొడ్యూసర్​ కూ ఉండకూడదు అనుకుంటున్నారట మైత్రీ మూవీ మేకర్స్​. ఎందుకంటే వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్​ ను ఫుల్​ స్వింగ్​ లో కానిచ్చేస్తున్న మైత్రీ వాళ్ళు.. బాలయ్య మూవీని పట్టించుకోవడం లేదని ఫ్యాన్స్​ నుంచి వార్నింగ్స్​ వస్తున్నాయట. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మైత్రీ వాళ్ళు సొంతంగా రిలీజ్​ చేస్తున్న వీర సింహారెడ్డి చిత్రానికే.. వీరయ్య కంటే ఎక్కువ ధియేటర్లు ఇస్తున్నారని సమాచారం. ఈ వార్తతో అన్నా బాలయ్య అభిమానులు కాస్త శాంతిస్తారేమో చూడాలి.

ట్యాగ్స్​