కౌంటీ క్రికెట్​ ఆడనున్న కృనాల్​ పాండ్య

By udayam on July 2nd / 7:43 am IST

భారత క్రికెట్​ ఆల్​ రౌండర్​ కృనాల్​ పాండ్య ఇంగ్లీష్​ కౌంటీ క్రికెట్​ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కంట్రీ క్లబ్​ వార్విక్​షైర్​ జట్టుతో కలిసి వచ్చే సీజన్​లో రాయల్​ లండన్​ వన్డే కప్​ ఆడనున్నాడు. దీంతో ఈ సీజన్​లో ఇంగ్లీష్​ కౌంటీలకు ఆడనున్న మూడో భారత ఆటగాడిగా కృనాల్​ నిలిచాడు. అతడి కంటే ముందు ఈ సీజన్​లో చతేశ్వర్​ పుజారా, వాషింగ్టన్​ సుందర్​లు కౌంటీల్లో ప్రాతినిధ్యం వహించారు.

ట్యాగ్స్​