హత్యలు చేసే వారికి మేం ఎలాంటి సహాయం చేయమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. సరూర్నగర్లో జరిగిన పరువు హత్యపై మాట్లాడిన ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు. ‘సరూర్నగర్లో ఏదైతే జరిగిందో ఆ ఘటన చాలా దారుణం. ఎవరిని పెళ్ళి చేసుకోవాలన్నది మహిళ స్వతంత్ర నిర్ణయం. ఆమె భర్తను చంపే హక్కు యువతి సోదరులకు లేదు. ఇస్లాం ప్రకారం ఇది అత్యంత హేయమైన చర్య. హత్యలు చేసే వారిని మేం దూరం పెడతాం’ అని అసదుద్దీన్ స్పష్టం చేశారు.