పశ్చిమ-వాయువ్య దిశలో దక్షిణకోస్తాంధ్ర -ఉత్తర తమిళనాడు తీరాల వైపు కదులుతున్న వాయుగుండం రానున్న ఆరు గంటల్లో అల్పపీడనంగా బలహీనపడనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఈరోజు దక్షిణ కోస్తా(ప్రకాశం, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలు) మరియు రాయలసీమ (చిత్తూరు, వైఎస్ఆర్ మరియు అన్నమయ్య జిల్లాలు)లో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అవకాశం ఉందని పేర్కొంది.